వారి పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి... - padayathra
రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని... ధనిక, పేద, భేదం లేకుండా అందరికీ సమన్యాయం జరుగుతోందని ఓ సామాజిక కార్యకర్త వినూత్న నిరసన చేపట్టాడు.
సామాజిక కార్యకర్త నిరసన
కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన మోతే నరేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టాడు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని... లేనియెడల వారు రాజీనామా చేయాలని నిరసన చేపట్టాడు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి పాదయాత్ర కొనసాగించిన నరేష్ కరీంనగర్ జిల్లాకు చేరుకున్నాడు. రెండు చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని పాదయాత్ర చేస్తున్నాడు. రాష్ట్రమంతా ఇదే విధంగా నిరసన కొనసాగిస్తున్నాని నరేశ్ పేర్కొన్నాడు.