కరీంనగర్ రెండో డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంచిర్యాల వెళ్తుండగా చొప్పదండిలో బ్రేక్‌డౌన్ అయింది. ఆర్టీసీ సిబ్బంది బస్సు వద్దకు చేరుకొని రిపేర్ చేశారు. బస్సును తిరిగి కరీంనగర్‌కు తీసుకు వస్తుండగా... మంచిర్యాల కూడలిలో మళ్లీ బ్రేక్ ఫెయిలై రోడ్డుమీదే ఆగిపోయింది. పక్కకు పెట్టాలని పోలీసులు చెప్పగా... బస్సును వెనక్కి తీసే ప్రయత్నంలో అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ పైకి ఎక్కింది. ఎప్పుడూ రద్దీగా ఉండే కరీంనగర్-మంచిర్యాల రహదారిపై ఇలా జాగ్రత్తలు తీసుకోకుండా ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం వహించటంపై ప్రజలు మండిపడుతున్నారు.
నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్... - RTC Bus Breaks Fail
కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో హల్చల్ సృష్టించింది. అదుపు తప్పి డివైడర్ ఎక్కింది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో జరిగిన ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
RTC Bus Breaks Fail