తెలంగాణ

telangana

ETV Bharat / state

RED CHILLI Price Hike: భారీగా పెరిగిన ఎండు మిర్చి ధర

RED CHILLI Price Hike: ప్రస్తుతం దేశమంతట పెరిగిపోతున్న ఇంధన, నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులు విలవిల్లాడుతుంటే.. ఎండు మిర్చి ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈసారి మిర్చి దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్​లో ధర ఆకాశన్నంటుతుంది.

RED CHILLI
ఎండు మిర్చి

By

Published : Apr 16, 2022, 10:22 PM IST

RED CHILLI Price Hike: కరీంనగర్ జిల్లాలో ఎండు మిర్చి ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మిర్చి దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్​లో ధర ఆకాశన్నంటుతుంది. గత ఏడాది కిలో ఎండు మిర్చి రూ.130గా ఉంది. ఈ సంవత్సరం రూ. 200 నుంచి రూ. 250 వరకు ధర పలుకుతోంది. ప్రతి శనివారము సంత జరుగుతుంది. ప్రజలు ఎండు మిర్చి ధరను చూసి అమ్మో అంటున్నారు.

ఇదిలా ఉండగా రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది. ఎకరం విస్తీర్ణంలో మిరప పంటను సాగు చేస్తే పది క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా .. అది కాస్తా వర్షాల కారణంగా 5 క్వింటాళ్లే వచ్చాయి. పండించిన పంటను అటు ఇంట్లో ఉంచలేక ఇటు మార్కెట్​లో తగిన గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details