ముస్లింలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే రంజాన్ పండుగకు సంబంధించిన మార్కెట్ కొనుగోలు అమ్మకాల కోసం సిద్ధమైంది. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలకు ఈసారి ఎండ తీవ్రత ఉష్ణోగ్రత కఠిన పరీక్షనే పెట్టిందని చెప్పాలి. ప్రతి సంవత్సరం రంజాన్ మూడవ వారం నుంచే మార్కెట్‌లో కొనుగోలు అమ్మకాలతో కళకళలాడేది.. కానీ ఈసారి ఈ ఎండల కారణంగా కొనుగోళ్లకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదని వ్యాపారులు చెబుతున్నారు.
నెలరోజుల పాటు కఠినంగా ఉపవాసాలు దీక్షలు చేపట్టిన ముస్లింలు అత్యంత శ్రద్ధతో పండగ రోజు ప్రత్యేకంగా షీర్‌ఖుర్మాతో పాటు ఘుమఘుమలాడే వంటకాలు చేపడతారు. ప్రధానంగా ఇందులో డ్రైఫ్రూట్స్ ఎక్కువగా వినియోగిస్తారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న రకరకాల ఖర్జూర పళ్లతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, సేమియాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.