తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2020, 5:13 PM IST

ETV Bharat / state

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో రైతులు పండించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోవటం వల్ల అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Rain-drenched grain in Karimnagar district
అకాల వర్షానికి తడిసిన ధాన్యం

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అకాల వర్షానికి రైతులు పండించిన ధాన్యం కొట్టుకుపోయింది. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలకు చెందిన రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చారు.అయితే మార్కెట్‌లో సరైన సదుపాయాలు లేకపోవటం వల్ల ఆ ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇలా వర్షపు నీటిలో తడిసిపోవటం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్​ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తడిసిన ధాన్యాన్ని సహితం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details