కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, ఇల్లంతకుంట, బెజ్జంకి, శంకరపట్నం మండలాల్లో పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టారు. గన్నేరువరం మండలం పారువెల్లలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు చెక్కిళ్ల రవీందర్ గౌడ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
గన్నేరువరం మండల వ్యాప్తంగా పల్స్ పోలియో
పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా పిల్లలకు చుక్కల మందు వేశారు. గన్నేరువరం మండలం పారువెల్లలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గన్నేరువరం మండల వ్యాప్తంగా పల్స్ పోలియో
మండలంలో 2014 మంది పిల్లలకు గానూ 1954 చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు ప్రాథమిక వైద్య పర్యవేక్షకులు శ్రీనివాస్, రమేశ్ తెలిపారు. మిగిలిన వారికి ఇంటికెళ్లి పోలియో చుక్కలను వేస్తామన్నారు.
ఇదీ చదవండి:'రామాలయ నిర్మాణానికి కేసీఆర్ అనుకూలమా? కాదా'