కరీంనగర్ జిల్లా గంగాధరలో రైతు వేదికల ప్రారంభానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్లు రానుండడంతో జిల్లా భాజపా నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైతు వేదికలకు కేంద్ర ప్రభుత్వం వాటా రూ.10 లక్షలు ఉన్నాయని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా కోశాధికారి రామానుజం తెలిపారు.
అభ్యంతరం తెలిపితే అరెస్టు చేస్తారా ?: భాజపా
రైతు వేదికల ప్రారంభోత్సవంలో ప్రధాని ఫొటో పెట్టలేదని అభ్యంతరం తెలిపితే అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదని... కరీంనగర్ జిల్లా భాజపా కోశాధికారి రామానుజం అన్నారు. గంగాధరలో రైతు వేదికల ప్రారంభానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్లు రానుండడంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు.
అభ్యంతరం తెలిపితే అరెస్టు చేయడం సమంజసం కాదు: భాజపా
ప్రధాని మోదీ, స్థానిక ఎంపీ బండి సంజయ్ ఫొటోలు పెట్టలేదని నిరసన వ్యక్తం చేశారు. అభ్యంతరం తెలిపితే అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదని ఆయన అన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'రైతు వేదికలతో అన్నదాతల సమస్యలకు పరిష్కారం'