కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ సర్వే చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్లో ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీ ప్రజలకు ఏ మేరకు అందిందో తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్నామని ఆయన అన్నారు.
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై.. కాంగ్రెస్ వినూత్న సర్వే - పొన్నం ప్రభాకర్
లాక్డౌన్ క్రమంలో కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ సామాన్య ప్రజలకు ఏ మేరకు చేరిందో.. తెలుసుకోవడానికి కాంగ్రెస్ వినూత్న సర్వే చేపట్టింది. కరీంనగర్ పట్టణంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాకేంద్రంలోని మార్కెట్లో కూరగాయలు అమ్మేవారిని ఆయన స్వయంగా కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు ఏమైనా సహాయం అందిందా అని అడిగారు. ప్రజలు చెప్పిన సమాధానాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే చేతలకు ఏ మాత్రం పొంతన లేదని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదాయ పన్ను పరిధిలోకి రాని పేదల ఖాతాల్లో రూ.10వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హానీ పని దినాలను 200 రోజులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:మండుతున్న ఎండలు