కరీంనగర్ జిల్లా చొప్పదండిలో టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా.. ప్రభుత్వం రోజువారీగా ధరలు పెంచుతోందని ఆరోపించారు.
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన - పొన్నం ప్రభాకర్
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హస్తం నేతలు నిరసన చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన
కరోనా ప్రబలుతున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఆరేళ్లకాలంలో 18 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. అనంతరం టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంతో కలిసి స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు