తెరాస ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామిక విధానాలతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నిన్న రాత్రి మూడు గంటల సమయంలో తమ ఇంటి తలుపులు కొట్టి ఇంట్లో వాళ్లందరినీ భయభ్రాంతులకు గురిచేసిన పోలీసులపై తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇంటి ముందు పోలీసులను కూర్చోబెట్టడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా ఉద్యమంలో కూడా ఇటువంటి అణచివేతను ఎదుర్కోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సమస్యను నియంతలా చూడకుండా ప్రజాస్వామ్య వాదిగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు పొన్నం విజ్ఞప్తి చేశారు.
'రాష్ట్రంలో రాజరిక వ్యవస్థ నడుస్తోంది'
తెరాస ప్రభుత్వ హయంలో రాజరిక వ్యవస్థ నడుస్తోందని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చెప్పుకునే హక్కు ఉందన్నారు. తెలంగాణా ఉద్యమంలో కూడా ఇటువంటి అణచివేతను ఎదుర్కోలేదని పొన్నం వాపోయారు.
congress leader ponnam prabhakar house arrest today news
TAGGED:
tsrtc strike today news