కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని ఇందిరమ్మ కాలనీలో ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి ప్రతి ఇంట్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని ఎనిమిది ఆటోలు, 29 ద్విచక్ర వాహనాలు, ఆరు ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఏసీపీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు - usharani
కరీంనగర్ రేకుర్తిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు.
నిర్బంధ తనిఖీలు