Pm Modi call to Bandi Sanjay : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ జాగరణ దీక్ష... అరెస్టు పరిణామాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తెరాసతో గట్టిగా పోరాడాలని ఎక్కడా వెనక్కి తగ్గొద్దని... ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం కొనసాగించాలని తెలిపారు. ఎంపీ కార్యాలయంపై దాడిని ప్రధాని ఖండించారు.
దాడికి కారణాలేంటి..?
తెరాస ప్రభుత్వంపై సంజయ్ చేస్తున్న పోరాటాన్ని మోదీ అభినందించారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా తప్పులేదని సంజయ్‌తో అన్నారు. 317జీవో గురించి మోదీ ఆరా తీశారు. వ్యక్తిగతంగా సంజయ్‌పై దాడి చేయడానికి కారణాలేంటని ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను కూడా మోదీ ప్రస్తావించారు. వరుస విజయాలతో తెరాస వ్యక్తిగత దాడులకు దిగుతోందా అని మోదీ ఆరా తీశారు.