తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్‌లో పార్కులు ప్రారంభించిన మంత్రి గంగుల - కరీంనగర్‌ వాార్తలు

స్మార్ట్‌సిటీ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన రెండు పార్కులను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రభుత్వ పార్కులు ఆక్రమణలకు గురికాకుండా సరిహద్దు గోడలు నిర్మిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులోకి మరిన్ని చిన్న పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Parks Inaugauration in karimnagar by minister gangula kamalakar
కరీంనగర్‌లో పార్కులను ప్రారంభించిన మంత్రి గంగుల

By

Published : Oct 18, 2020, 2:01 AM IST

ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి కాకుండా పార్కులు నిర్మించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో అభివృద్ధి చేసిన రెండు పార్కులను ఆయన ప్రారంభించారు. పార్కుల స్థలాలు అక్రమణలకు గురికాకుండా సరిహద్దు గోడలు నిర్మిస్తామన్నారు.

స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా కాలనీల్లో ప్రజలకు చిన్నచిన్న పార్కులు అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా కబ్జాకు గురయ్యేవని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం: గంగుల

ABOUT THE AUTHOR

...view details