కరోనా తీవ్రమై ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరగడంతో ఆక్సిజన్ అవసరం పడుతోంది. కరీంనగర్ జిల్లాలో ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పరిశ్రమలకు సరఫరా పూర్తిగా నిలిపివేసి ఆ సిలిండర్లను ఆసుపత్రులకు మళ్లిస్తున్నారు. కరీంనగర్ జిల్లాతోపాటు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోని ఆస్పత్రులకు ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది.
డిమాండ్ పెరుగుతుంది
గతంలో రోజుకు మూడు జిల్లాలకు కలుపుకొని 200నుంచి 300 ఆక్సిజన్ సిలిండర్లు విక్రయించేవారు. ప్రస్తుతం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 1,500కుపైగా సిలిండర్లు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రోజురోజుకు ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతోందని ఆస్పత్రుల నిర్వాహకులు చెబుతున్నారు.