కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. మృతుడు తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంకు చెందిన జక్కుల సంతోష్‌గా గుర్తించారు. శనివారం రాత్రి వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలం వద్ద మృతుడి ద్విచక్ర వాహనం, చరవాణిలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారమే కారణమా...!