కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పోలీసులకు, కార్మికులకు మధ్య జరిగిన తోపులాట జరిగింది. ఈ క్రమంలో అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలతో ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
బండి సంజయ్‌పై దాడి ఘటనలో పోలీసులపై కేసు - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో ఎంపీ సంజయ్‌పై జరిగిన దాడిపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది.
బండి సంజయ్‌పై దాడి ఘటనలో పోలీసులపై కేసు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లో తనపై దాడి జరిగినట్లు వివరించారు. తెలంగాణ పోలీసులు, కరీంనగర్ కలెక్టర్‌పై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చానని స్పీకర్‌కు వెల్లడించారు. స్పందించిన బిర్లా... విచారణ చేయాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్‌కుమార్ సింగ్‌కు ఆదేశించారు. దాడిచేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : వీడిన చిక్కుముడి... ప్రియుడే హంతకుడు
Last Updated : Nov 7, 2019, 1:51 PM IST