మానవ సంబంధాల్ని బలపరిచేవి.. నైతిక విలువల్ని నేర్పేవి కథలేనని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. కరీంనగర్లో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా సాహిత్యం- సమాలోచన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
' కథలు చదివి ఉంటే 'దిశ' మరణించేది కాదు'
మానవ సంబంధాల్ని బలపరిచేవి.. సమాజమేంటో తెలిపేవి కథలేనని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి తెలిపారు. కథలు చదివి ఉంటే దిశ మరణించేంది కాదని అభిప్రాయపడ్డారు.
' కథలు చదివి ఉంటే 'దిశ' మరణించేది కాదు'
కథలు చదివి ఉంటే 'దిశ' ఘటన జరిగేదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో మంచి చెడుల గురించి గురించి తెలుసుకునేలా చేసేవి కథలేనన్నారు. విద్యాభివృద్ధికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సేవలు అభినందనీయమన్నారు. కాలువ మల్లయ్య, కల్వకుంట్ల రామకృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య యాదగిరి పాల్గొన్నారు.
ఇవీచూడండి:'దిశ' కంఠుల హతం.. ప్రజల హర్షం