తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలను ప్రారంభించిన ఎంపీ - కరీంనగర్ ఎంపీ

కరీంనగర్ జిల్లా కేంద్రంగా జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు కరీంనగర్​లో నిర్వహించడం పట్ల ఎంపీ బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలను ప్రారంభించిన ఎంపీ

By

Published : Sep 19, 2019, 8:16 AM IST

జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. స్థానిక డాక్టర్​ బి.ఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను ఆయన ప్రారంభించారు. కెడెట్స్​, జూనియర్ విభాగాల్లో ఒడిశా, హర్యానా, దిల్లీ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి 1000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కిక్​ బాక్సింగ్​ పోటీలు కరీంనగర్​లో నిర్వహించడం గర్వంగా ఉందని ఎంపీ సంజయ్ కుమార్​​ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా మైదానాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.

జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలను ప్రారంభించిన ఎంపీ

ABOUT THE AUTHOR

...view details