ఎంపీ వినోద్ తనయడి ఎన్నికల ప్రచారం కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో తెరాస పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తనయుడు ప్రణయ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్లలో ఎంపీ వినోద్ కుమార్ చేపట్టిన పనుల వివరాలతో ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వినోద్ కుమార్ వీర్నపల్లిని దత్తత తీసుకొని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు. అదే తరహాలో గన్నేరువరంకు కోటి పది లక్షల నిధులు కేటాయించి సీసీ రోడ్లు నిర్మించారన్నారు. మరోసారి ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పూర్తిస్థాయిలో మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని తెలిపారు.