తెలంగాణ

telangana

ETV Bharat / state

కొరత లేనప్పుడు ఇంతమంది ఎలా చనిపోతున్నారు: బండి సంజయ్ - mp bandi sanjay kumar latest news

కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​కు భాజపా పూర్తి మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. కరోనా కేసులు, మరణాల సంఖ్యను వాస్తవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

mp bandi sanjay visited huzurabad govt hospital
హుజూరాబాద్ ఆస్పత్రిని సందర్శించిన బండి సంజయ్ కుమార్

By

Published : May 14, 2021, 5:00 PM IST

కరోనా కేసుల వివరాలు, మరణాల సంఖ్యను వాస్తవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన... ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందించే సేవలను గురించి సూపరింటెండెంట్‌ డాక్టర్ రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ పరీక్షలు, టీకాల పంపిణీ గురించి చర్చించారు.

కొరత లేనప్పుడు.. ఇన్ని చావులెందుకు?

రాష్ట్రంలో ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, పరీక్షల కిట్ల కొరత లేదని ట్విట్టర్‌ ద్వారా మంత్రి తెలిపారని... కొరత లేకుంటే ఇంత మంది జనం ఎందుకు చనిపోతున్నారని ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. కరోనాను రాజకీయ కోణంలో చూసే ప్రయత్నం చేయొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు తీసుకునే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. నామ మాత్రంగా సమీక్షలు జరుపుతుండటం వల్లే ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

హుజూరాబాద్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్​లు చెల్లించాలి..

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చినందున రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు భాజపా సంపూర్ణ మద్దతు పలుకుతుందని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరతతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది మృత్యువాత పడటం చాలా బాధాకరమన్నారు. ఆసుపత్రిలో పని చేసే సిబ్బందికి ఇన్సెంటీవ్‌లు చెల్లించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు.

రైతుబంధు డబ్బులు వేయాలి..

రైతులను ఆదుకునే ఉద్దేశంతో 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను… రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం… ఈ ఏడాది బకాయిలను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని కోరారు. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడే రైతుబంధు పథకం నిధులను విడుదల చేస్తున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి:కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్

ABOUT THE AUTHOR

...view details