కరీంనగర్ విద్యానగర్‌లో సోమవారం దారుణ హత్యకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని రాధిక కుటుంబాన్ని ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఇలాంటి హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదని చెప్పారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.
రాధిక కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ బండి సంజయ్ - కరీంనగర్
దారుణ హత్యకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని రాధిక కుటుంబాన్ని ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులతో పాటు పౌరులు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.
ఎంపీ బండి సంజయ్
పోలీసులు సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకోవడమే కాకుండా కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులతో పాటు పౌరులు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. హంతకుల గురించి ఏ సమాచారం తెలిసినా పోలీసులకు తెలపాలన్నారు.
ఇదీ చదవండి:ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి