రాజకీయ కోణంతో తెరాస, కాంగ్రెస్, కమ్యూనిస్టుసు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20,21,22 తేదీల్లో నిర్వహిస్తున్న తెలంగాణ వైభవం సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. శాతవాహనుల కాలంలోనే తెలంగాణ ఎంతో వైభవంతో వెలుగొందిందని ఎంపీ పేర్కొన్నారు. ఆ రోజుల్లోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పతాక స్థాయికి చేరుకుందని తెలిపారు. మరుగునపడిన చరిత్ర, సాహిత్యాలను వెలికితీసే విధంగా.. అధ్యయనాలను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు ముఖ్య భూమిక పోషిస్తుందని ఎంపీ వెల్లడించారు. మైనార్టీల ఓట్ల కోసమే తెరాస ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు.
వాళ్లంతా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు: బండి సంజయ్ - వాళ్లంతా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు: బండి సంజయ్
తెరాస, కాంగ్రెస్, కమ్యూనిస్టులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పేందుకు.. తెలంగాణ వైభవం పేరుతో కరీంనగర్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాలను విడుదల చేశారు.
వాళ్లంతా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు: బండి సంజయ్