కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ వార్డును స్థానిక ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సందర్శించారు. పీపీఈ కిట్ ధరించి ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం వార్డులో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించారు.
కొవిడ్ ఐసోలేషన్ వార్డును సందర్శంచిన ఎంపీ బండి సంజయ్ - తెలంగాణ వార్తలు
కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ వార్డును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. పీపీఈ కిట్ ధరించి ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు.
బండి సంజయ్
కొవిడ్ బాధితులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, అపోహలు తొలగించుకోవాలని, వైద్యులు సూచించిన ప్రకారం చికిత్స చేయించుకోవాలని కోరారు. కరోనా విషయంలో అనవసర భయాందోళనలే మరణానికి దారి తీస్తున్నాయని, కరోనాను జయిస్తామనే అనే సంకల్పం బాధితులు కలిగి ఉండాలని సూచించారు. ఐసోలేషన్ వార్డును మరింత శుభ్రంగా ఉంచాలని, రోగులకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని బండి సంజయ్ కుమార్ ఆదేశించారు.
ఇదీ చదవండి:ఈటల వ్యవహారం సీఎం పరిధిలో ఉంది: తలసాని