ఆరెపల్లిలో డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే మఫ్టీలో ఉన్న పోలీసులు తనపై దాడికి పాల్పడి... శవాన్ని ఎత్తుకు పోయారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీస్ కేసులు కొత్త కాదని పేర్కొన్నారు. లక్షల మంది ఓటేసిన ప్రజాప్రతినిధి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆశ్చర్యంగా ఉందని దుయ్యబట్టారు. అసలు ఎవరి ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికుని శవయాత్రలో గలాభా సృష్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 21 మంది ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడితే పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని బండి సంజయ్ పేర్కొన్నారు.
నాకు పోలీస్ కేసులు కొత్తేం కాదు: ఎంపీ బండి సంజయ్ - ఎంపీ బండి సంజయ్
కరీంనగర్లో గుండెపోటుతో మృతిచెందిన డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసులపై చర్య తీసుకోవాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాకు పోలీసు కేసులు కొత్తేం కాదు: ఎంపీ బండి సంజయ్