తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖిల్లాపై జిల్లా అధికారులు - సర్ఫరాజ్​ అహ్మద్​

కరీంనగర్​ జిల్లా మొలంగూర్​ గుట్టపై కలెక్టర్, సీపీ​ ఇతర అధికారులు ట్రెక్కింగ్​ చేశారు. మొలంగూర్​ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఖిల్లా పరిశీస్తున్న కలెక్టర్​, సీపీ

By

Published : Feb 10, 2019, 6:05 PM IST

ఖిల్లాపై జిల్లా అధికారులు
కరీంనగర్‌ జిల్లా మొలంగూర్‌ గుట్టపై కలెక్టర్​ సర్ఫరాజ్ ​అహ్మద్​, సీపీ కమలాసన్​రెడ్డి ట్రెక్కింగ్‌ చేశారు. అనంతరం మొలంగూర్‌ ఖిల్లాను సందర్శించారు. గుట్టపై ఎక్కుతూ స్థానికులను మొలంగూర్‌ ప్రాముఖ్యతను అడిగి తెలుసు కున్నారు. ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. గుట్ట ట్రెక్కింగ్‌ చేయడానికి అనువైన ప్రాంతమని తెలిపారు. గ్రామస్థులు సమష్టిగా ఉండి ఖిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఖిల్లాపై కలెక్టర్‌, సీపీ మొక్కలను నాటారు. మొలంగూర్‌ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దూదిబావిని కూడా సందర్శించారు. అధికారులు, ఎన్‌సీసీ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details