ఎమ్మెల్సీ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా 14 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానం కోసం 9మంది, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామపత్రాలను కరీంనగర్ సహాయ ఎన్నికల అధికారి భిక్ష నాయక్‌కు అందించారు. పీఆర్టీయు ఉపాధ్యాయ సంఘం తరఫున కూర రఘోత్తమరెడ్డి తోటి సహచరులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. భాజపా బలపరచిన అభ్యర్థిగా కామారెడ్డికి చెందిన అరుణజిత్ మోహన్ పట్టభద్రుల స్థానం కోసం నామపత్రాలను అందించారు. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి వి.కొండల్‌రెడ్డి ఉపాధ్యాయ స్థానానికినామినేషన్ వేశారు.