Ravinder singh on Ministers: కరీంనగర్లో మంత్రి ఎర్రబెల్లి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ మండిపడ్డారు. క్యాంపు రాజకీయాలు చేయడమే కాకుండా మీరు వేసే ఓటు మాకు తెలిసే విధంగా కెమెరాలు అమరుస్తున్నామని ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలు అమర్చే దమ్ముందా అని ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను బెదిరించి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్నడూ జీతాలు ఇవ్వని ప్రభుత్వం కేవలం నేను నామినేషన్ వేయడంతో ఎన్నికల కోసమే జీతాలు విడుదల చేసిందన్నారు.
కేటీఆర్ చెబుతారు కానీ పాటించరు
ravinder singh on KTR: పురపాలక మంత్రి కేటీఆర్ అందరికీ క్లాసులు బాగానే చెప్తారు కానీ.. తాను మాత్రం పాటించరని రవీందర్ సింగ్ విమర్శించారు. సిరిసిల్లలో రోజుకు 526 లారీల ఇసుక తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు పురపాలక శాఖమంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక్కరోజైనా ఉదయాన్నే లేచి పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలించారా అని ప్రశ్నించారు. కార్పొరేటర్లకు కనీసం శిక్షణ తరగతులు కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని రవీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి ఎర్రబెల్లి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. మీరు ఓటేసేది చూసేందుకు కెమెరాలు పెడుతున్నాం అంటున్నారు. ఓటింగ్లో కెమెరాలు ఎలా పెట్టిస్తావో మేము చూస్తాం. మా ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్నావ్. కరీంనగర్లో నీ ఆటలు సాగవ్. నీ క్యాంపు రాజకీయాలు ఇక్కడ నడవవు. సిరిసిల్లలో కొంతమందిని కలిసినాం. రోజుకు 526 ఇసుక లారీలు అక్కడ నుంచి పోతున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకేమో లారీలు అందుబాబులో లేవంటారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఏ ఒక్కరోజైనా ఉదయాన్నే లేచి తిరిగారా.. కార్పొరేటర్లకు ఏనాడైనా శిక్షణ ఇప్పించారా? ఎంపీటీసీలకు ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. నేను నామినేషన్ వేయగానే జీతాలు పడ్డాయి. - రవీందర్ సింగ్, ఎమ్మెల్సీ అభ్యర్థి
ఇదీ చూడండి: