విపణిలో డిమాండ్ ఉన్న పంటలు పండించడం వల్ల రైతులకు అధిక లాభాలు కలుగుతాయని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. నియోజకవర్గంలోని మంగలపల్లిలో దుక్కి దున్ని సాగుబాటను ఆయన ప్రారంభించారు. పంట మార్పిడి రైతులకు లాభసాటి కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సన్న రకం మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం చెప్పలేదని... కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రానున్న పంట కాలంలో వర్షాలతో సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో సాగు చేసుకోవచ్చన్నారు.
'రైతు సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల విమర్శలు'
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మంగలపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దుక్కిదున్ని సాగుబాటను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి రూ. 3 వేల కోట్ల రైతు బీమా ప్రీమియం చెల్లిస్తోందని ఆయన తెలిపారు.
దుక్కిదున్ని సాగుబాట ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె
ఈసారి సుమారు 40 వేల ఎకరాల వరిసాగు పెరిగే అవకాశం ఉందన్నారు. అంజీర, డ్రాగన్ పండ్ల తోటలను పెంచుతున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, అరటి, ద్రాక్ష తోటల పెంపకం సైతం పంట మార్పిడిలో చేపట్టవచ్చని తెలిపారు. నేల స్వభావాన్ని బట్టి తోటల పెంపకం చేపట్టాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసేటట్లు రైతులను వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలన్నారు.
ఇవీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల