తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే - Support price for farmers

కరీంనగర్​ జిల్లాలో పలు గ్రామాల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రారంభించారు. దళారులకు తక్కువ ధరకు పత్తిని విక్రయించుకుని మోసపోవద్దని సూచించారు.

MLA Sunke Ravishankar launches cotton buying centers
సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Nov 7, 2020, 3:50 PM IST

కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్​, రామడుగు మండలం వెలిచాలల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రారంభించారు. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించుకుని సరైన ధర పొందాలని కోరారు.

దళారులకు తక్కువ ధరకు పత్తిని విక్రయించుకుని మోసపోవద్దని సూచించారు. ఎనిమిది శాతం తేమ కలిగిన పత్తికి క్వింటాలుకు రూ.5825 ధరను పొందవచ్చని ప్రకటించారు. అధిక వర్షాలతో దిగుబడి తగ్గిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో హైదరాబాద్ ఆదర్శం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details