కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లికి చెందిన అనాథ పిల్లలు పిట్టల మనీషా, రాజులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆర్థిక సహాయం అందజేశారు. తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో మృతి చెందడం వల్ల సొంత ఆస్తులు లేక, నిలువ నీడ లేని అనాథ పిల్లల దుర్భర స్థితిని తెలుసుకుని ఎమ్మెల్యే ఆపన్నహస్తం అందించారు.
అనాథ పిల్లలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం - అనాథ పిల్లలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
అనాథ పిల్లలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆపన్నహస్తం అందించారు. తల్లిదండ్రులు లేని ఇద్దరు అనాథ పిల్లల దుర్భర స్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వపరంగా కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అనాథ పిల్లలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
ఆయనతో పాటు తెరాస పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కలిసి రూ.77 వేల నగదును అందించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అనాథ పిల్లలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. రెండు పడక గదుల ఇళ్లు, బీమా వర్తించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: 'రైతుకు లాభం కోసమే.. నియంత్రిత సాగు'