కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం, కోరిటపల్లి గ్రామాల్లో రూ.5 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ముందు చొప్పదండి నియోజకవర్గంలో సాగునీటి కొరత వల్ల అందరూ వలస వెళ్లేవారని తెలిపారు. శాశ్వత సాగునీటి వనరుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని అభిప్రాయపడ్డారు.
వరద కాలువలు జీవ నదులుగా మారాయి: సుంకె
కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో చెక్ డ్యాం నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని వరద కాలువలు జీవ నదులను తలపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వరద కాలువలు జీవ నదులుగా మారాయి: ఎమ్మెల్యే
ఇదే నియోజకవర్గంలో ఎస్సారెస్పీ వరద కాలువ... జీవనదిని తలపిస్తోందన్నారు. నియోజకవర్గంలో 16 చెక్ డ్యాం నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలపై హౌస్‌మోషన్ పిటిషన్