తెలంగాణ

telangana

ETV Bharat / state

చెత్త తొలగించిన ఎమ్మెల్యే!

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పట్టణంలో సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పలు వార్డుల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. మురుగు కాల్వల్లో ఉన్న చెత్తను స్వయంగా ఆయనే తొలగించారు. మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉంటే.. దోమలు పెరిగి సీజనల్​ వ్యాధులు వ్యాపిస్తాయన్నారు.

MLA Sunke Ravi Shankar Cleans Drainage Canal In Choppadandi
చెత్త తొలగించిన ఎమ్మెల్యే!

By

Published : Jun 1, 2020, 1:46 PM IST

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పట్టణంలో శాసన సభ్యులు సుంకె రవిశంకర్​ పర్యటించారు. చొప్పదండి మున్సిపాలిటీలోని పలు వార్డులు సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగు కాల్వల్లో పేరుకున్న చెత్తను ఆయన స్వయంగా శుభ్రం చేశారు. దోమలు పెరిగేందుకు అవకాశమున్న ఖాళీ కొబ్బరిబోండాలు, ఇంటి చుట్టుపక్కల ఉన్న గడ్డిమొక్కలను తొలగించారు.

పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే.. విషజ్వరాలు వచ్చే ప్రమాదముందని ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డుల్లో బ్లీచింగ్​ పౌడర్​ క్రమం తప్పకుండా చల్లి.. సీజనల్​ వ్యాధులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. రానున్న వర్షాకాలంలో దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.

ఇదీ చూడండి:మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details