కరీంనగర్ జిల్లాలోని వెదురుగట్ట గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి.. బాగా అభివృద్ధి చేశారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని... కొప్పుల పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అంతరించిన పోయిన అడవులు నేడు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో 31 శాతం అడవులు ఉండేలా ప్రారంభించిన ఈ కార్యక్రమం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుందని మంత్రి పేర్కొన్నారు.
'గతంలో అంతరించిన అడవులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి' - మంత్రి కొప్పుల ఈశ్వర్
గత ప్రభుత్వాల కాలంలో అంతరించి పోయిన అడవులు... హరితహారం కార్యక్రమం ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని వెదురుగట్ట గ్రామంలో జరిగిన హరితహారంలో ఆయన పాల్గొని... ఆయన మొక్కలు నాటారు.
'గతంలో అంతరించిన అడవులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి'