తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao Challenge: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఈటలకు హరీశ్​రావు ఛాలెంజ్!

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్​పేటలో వడ్డెర ఆశీర్వాద సభకు మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్​రావు... ఈటల రాజేందర్​కు (Harish Rao Challenge) సవాల్ విసిరారు.

Harish Rao Challenge
మంత్రి హరీశ్​రావు

By

Published : Oct 12, 2021, 7:34 PM IST

అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఈటలకు హరీశ్​రావు ఛాలెంజ్!

గ్యాస్ సిలిండర్ ధరలో రూ. 291 రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా (Harish Rao Challenge) చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. లేనిపక్షంలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్​కు హరీశ్​రావు సవాల్ (Harish Rao Challenge) విసిరారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్​పేటలో వడ్డెర ఆశీర్వాద సభకు మంత్రి హాజరయ్యారు.

ఇద్దరు పోయి ముగ్గురు అంతే!

ఈటల రాజేందర్ పదవిలో ఉన్న ఐదు ఏండ్లలో హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,000 ఇండ్లు మంజూరు చేస్తే ఒక్కటైన కట్టలేదని మంత్రి హరీశ్​ రావు ఎద్దేవా చేశారు. ఈటలను గెలిపిస్తే భాజపాకు ఇద్దరు పోయి ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదన్నారు. తెరాస పార్టీ సభ పెట్టుకున్నారని... ఆ మీటింగ్​కు పోకండి అంటూ మనిషికి 300 రూపాయలు పంచుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు.. కుర్చీలో ఉన్నప్పుడు పేద ప్రజలు కనపడలేదా అని ఈటల రాజేందర్​ను ప్రశ్నించారు.

భాజపాను నమ్మొద్దు...

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అండగా ఉంటే ఈటల మాత్రం తెరాసను దూషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే రావని... పేదలపై పన్నులు వేసే ప్రభుత్వం భాజపా ప్రభుత్వమని విమర్శించారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని... పైసలతో మనిషిని ఆపుతారు కాని మనసుని అపలేరన్నారు. గెల్లుని గెలిపించి నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. అబద్ధాల భాజపా బోగస్ మాటలు నమ్మొద్దని ప్రజలకు తెలిపారు.

ఈటల రాజేందర్​కు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఐదేండ్ల కింద డబుల్ బెడ్​రూం ఇండ్లు కట్టమని 4వేల ఇండ్లు మంజూరు చేసిండు. కానీ రాజేందర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఈటలను గెలిపిస్తే భాజపాకు ఇద్దరు పోయి ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు. వాళ్ల గవర్నమెంట్ రాదు ఆయన మంత్రి కాడు. మంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లు కట్టనివాడు రేపు ఎమ్మెల్యే అయితే కడతాడా? ఆరుసార్లు ఈటలకు ఓటేశారు. ఈసారి గెల్లుకు ఓటేయండి. కచ్చితంగా ఈ రెండు ఏండ్లలో డబుల్ బెడ్​రూం ఇండ్లు కట్టి చూపిస్తం. ఒకవేళ గ్యాస్ సిలిండర్​పై రాష్ట్ర ప్రభుత్వం 291 రూపాయల పన్ను వేసి ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా. లేదంటే నువ్వు పోటీ నుంచి తప్పుకుంటావా?

--- హరీశ్​రావు, మంత్రి

ఇదీచూడండి:huzurabad by election: తెరాస మంత్రుల పద్మవ్యూహంలో చిక్కని ఈటల..!

ABOUT THE AUTHOR

...view details