ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జ్యోతినగర్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. మొదటి ఆలయానికి వెళ్లిన మంత్రికి స్థానిక కార్పొరేటర్ గందె మాధవి ఘనస్వాగతం పలికారు.
జ్యోతినగర్ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న గంగుల - కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
జ్యోతినగర్ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న గంగుల
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నగరపాలకసంస్థ మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.