తెలంగాణ

telangana

ETV Bharat / state

gangula kamalakar: '57 రకాల పరీక్షలు ఉచితం' - 57 types of tests free

కరీంనగర్ జిల్లా కేంద్రం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని(diagnostic centre) మంత్రి గంగుల(minister gangula kamalakar), జిల్లా కలెక్టర్ శశాంక, నగర మేయర్ సునీల్ రావులు కలిసి ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రజలకు 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

minister gangula kamalakar
gangula kamalakar: '57 రకాల పరీక్షలు ఉచితం'

By

Published : Jun 9, 2021, 9:57 PM IST

కరీంనగర్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్(minister gangula kamalakar) అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్​ను(diagnostic centre) కలెక్టర్ శశాంక, నగర మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ప్రజలకు రోగ నిర్ధరణ సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో… ఏక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు స్పష్టం చేశారు.

జిల్లాలోని 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి శాంపిళ్లను సేకరించి… మూడు రూట్ల ద్వారా డయాగ్నోస్టిక్ కేంద్రానికి(diagnostic centre) పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ విజయ, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:kodandaram: 'జర్నలిస్టు రఘను వెంటనే విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details