సిరిసిల్ల జిల్లాలో రైతులు చేపట్టిన ఆందోళన బాధాకరమని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. రైతులు దైవంలా భావించే ధాన్యాన్ని దహనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్రములో లేని విధంగా తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. సమైఖ్య రాష్ట్రంలో కూడా ఇంతగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు.
దయచేసి ధాన్యాన్ని తగలబెట్టకండి: గంగుల
రైతుల నుంచి ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దైవంలా భావించే ధాన్యాన్ని రైతులు తగల బెట్టెద్దని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటిదాకా లక్షా 67వేల మంది రైతుల నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు. కొన్ని జిల్లాల్లో వరి పంటకు అగ్గి తెగులు రావడం వల్ల తాలు ఎక్కువ వస్తుందని... తాలు లేకుండా చూసుకొని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. మూడు రైస్ మిల్లులకు ఒక ప్రత్యేకాధికారి చొప్పున కొనుగోలు కేంద్రాల్లో నియమించినట్టు వివరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, నగర మేయర్ వై. సునీల్ రావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వాట్సప్ చాట్‌బోట్ సేవలు ఇప్పుడు ఉర్దూలో!