కరీంనగర్‌కు సంబంధించిన ఆర్ అండ్ బీ శాఖ పనుల పురోగతిపై ఇంజినీర్లు, అధికారులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. తీగలవంతెన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోతే కుదరదని టాటా ట్రస్ట్‌కు మంత్రి స్పష్టం చేశారు. వంతెనకు అవసరమైన భూసేకరణతోపాటు మిగతా పనులకు అవసమరమయ్యే నిధుల వివరాలకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సర్వీస్ రహదార్లు, అండర్ పాస్‌లతో పాటు వంతెనపై డైనమిక్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలపై చర్చించారు. ఎలగందుల మీదుగా కరీంనగర్-వేములవాడ రహదారి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ ఇంజినీర్‌ను మంత్రి ఆదేశించారు.
'తీగలవంతెన పనులు జూన్ నాటికి పూర్తి చేయాలి' - minister gangula kamalakar review on karimnagar R&B Works today news
కరీంనగర్లో నిర్మిస్తున్న తీగలవంతెన పనులను వచ్చే జూన్ వరకు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగులకమలాకర్ అధికారులను ఆదేశించారు.
minister gangula kamalakar review on karimnagar R&B Works