కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం(Huzurabad by election 2021) ఊపందుకుంటోంది. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్(trs candidate Gellu Srinivas Yadav) నామపత్రాలు దాఖలు చేయగా.. ఆయన తరఫున మంత్రులు ప్రచార బరిలోకి దిగారు. మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్‌లో(minister gangula kamalakar campaign in huzurabad) పర్యటించారు. దళితవాడ, 12వ వార్డుతో పాటు బోర్నపల్లి, ముక్కపల్లి, బీసీ కాలనీ, ఇందిరానగర్ కాలనీలో కలియతిరిగారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. పలువురు దుకాణదారులతో మాట్లాడిన మంత్రి గంగుల.. వారి ఓట్లు అభ్యర్థించారు. లాండ్రీ దుకాణంలో దుస్తులు ఇస్త్రీ చేశారు. కుల వృత్తులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని గంగుల ప్రశంసించారు.
కుంకమ తిలకాలు
హుజూరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తూ స్థానికులతో మాట్లాడారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. మహిళలు కుంకుమ తిలకాలు దిద్దారు. కాలనీవాసులు, గ్రామస్థులతో మంత్రి మాట్లాడారు. మహిళలు పనికిపోకుండా ఎదురుచూసి... తనకు కడుపు నిండా దీవెనార్థులు పెట్టారన్నారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా పనులు చేయాలని కోరే ప్రజలు... తనకు బ్రహ్మాండమైన స్వాగతం పలికారని సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, కడుపునిండా భోజనం కూడా పెట్టలేదని ప్రజలు అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల తమకు ధైర్యం వచ్చిందని... తమ పిల్లల్ని ధైర్యంగా పోషిస్తున్నామన్నామని చెప్పారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పని చేసే తెరాస ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వారిని కోరారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను(minister gangula kamalakar campaign in huzurabad) భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బడుగు, బలహీన, దళిత వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించారు. దాని ఫలితమే రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం నీళ్లు, పంటల దిగుబడులు, ధళితబంధు వంటి పథకాలు వచ్చాయి. అందుకే రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయి.
-మంత్రి గంగుల కమలాకర్