కరీంనగర్‌లో 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మేయర్ సునీల్ రావుతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.
'విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది' - కళాశాల శంకుస్థాపన
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన జూనియర్ కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
'విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది'
''రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది. జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ.6కోట్లు అవసరం. ప్రస్తుతం కోటి 22 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా విద్యకు అంతగా ప్రాధాన్యమివ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పేద విద్యార్థులకు అవసరమయ్యే ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని... దానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది.''
- మంత్రి గంగుల కమలాకర్