ఓ అన్న తన చెల్లెలికి పంపే పండుగ కానుకగా.. బతుకమ్మ చీరలను భావించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ చేపడుతున్నారని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా.. మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారని.. సీఎంకు మహిళలంటే అమితమైన ప్రేమ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా.. మీ నుంచి కోరుకొనేది మాత్రం కేవలం ఆశీర్వచనాలేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ కమీషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పాల్గొన్నారు.
చెల్లెలికి పండగ కానుక... బతుకమ్మ చీర - gangula
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ చేపడుతున్నారని ఆయన కొనియాడారు.
గంగుల కమలాకర్