వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధరకు బయట అమ్ముడుపోని సమయంలో వాటిని మద్దతుధరతో కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని అధికారులు, రైస్‌మిల్లర్లతో వరిధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్షించారు.
ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి ఈటల - ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఈటల తాజా వార్త
రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, రైస్‌మిల్లర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి ఈటల
ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండ అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రెండు రోజుల పాటు స్వయంగా తానే నియోజకవర్గంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తానన్నారు. రైతు శ్రేయస్సే కేసీఆర్ థ్యేయమని.. రైస్‌మిల్లర్ల సమస్యలపై ముఖ్యమంత్రికి చక్కటి అవగాహన ఉందన్నారు.