కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గోదా రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. వేద పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. కల్యాణ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గోదా రంగనాథ స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గోదా కల్యాణం ఘనంగా జరిపారు. ఈ కల్యాణ మహోత్సవంలో మంత్రి ఈటల పాల్గొని... స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
గోదా రంగనాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఈటల
జమ్మికుంటలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం, రామాలయంలో నిర్వహించిన గోదా రంగనాథస్వామి కల్యాణ ఉత్సవాల్లోనూ మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం శ్యాం, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఐనవోలులో అంగరంగ వైభవంగా ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు