కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఇల్లంతకుంట మండలంలోని బూజునూరు, సీతంపేట, టేకుర్తి, సిరిసేడు గ్రామాల్లో గ్రామైక్య మహిళా సంఘాలు, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
'కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి' - Minister etala visited karimnagar
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మంత్రి ఈటల హుజూరాబాద్ పర్యటన
జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి మంత్రి ఈటల.. ధాన్యం తూకాలు వేసి కాంటాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. కేంద్రాలను సజావుగా నిర్వహించాలని, తూకాలను జాప్యం చేయకూడదని సూచించారు. రైతులంతా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈటల కోరారు.