కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన ఐలవేని వెంకటేశ్ కుమారుడు అక్షిత్‌పై ఈ నెల 17న వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో అక్షిత్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
బాలుడి చికిత్సకు మంత్రి ఈటల రాజేందర్ ఆర్థిక సాయం
ఆర్థిక సహయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కుక్కల దాడిలో ఏడు సంవత్సరాల బాలుడు తీవ్రంగా గాయపడగా.. చికిత్స కోసం రూ. 4 లక్షల చెక్కును అందించి ఆ కుటుంబాన్ని ఆదుకొన్నారు.
బాలుడి చికిత్సకు మంత్రి ఈటల ఆర్థికసాయం
చికిత్స నిమిత్తం ఖర్చులకు గాను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంకటేశ్‌కు రూ. 4లక్షల చెక్కును అందించారు. ఆసుపత్రి వైద్యులతో మంత్రి ఈటల మాట్లాడారు. నాణ్యమైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. త్వరలో బాలుడు కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటలకు వెంకటేశ్ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.