కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈటల రాజేందర్ చేతుల మీదుగా సభ్యత్వాలు స్వీకరించారు.
హుజూరాబాద్ పర్యటించిన మంత్రి ఈటల
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, పలు భవనాల్ని ప్రారంభించారు.
హుజూరాబాద్ పర్యటించిన మంత్రి ఈటల
అనంతరం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను, మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో నిర్మించిన చిన్నారుల పార్క్, కేసీ క్యాంపులో ఐసీడీఎస్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అందరి సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఈటల తెలిపారు.
ఇదీ చదవండిః ఉప్పొంగుతున్న కుంటాల జలపాతం