తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు పడక గదుల నిర్మాణాలపై మంత్రి ఈటల ఆరా - minister eetala rajendar review meeting

కరీంనగర్​ జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్​ పర్యటించారు. పట్టణంలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష జరిపారు.

డబల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలపై మంత్రి ఈటల ఆరా
డబల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలపై మంత్రి ఈటల ఆరా

By

Published : Feb 1, 2021, 6:32 PM IST

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటించారు. జమ్మికుంట తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. పట్టణంలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష జరిపారు.

రెండు పడకల గదుల నిర్మాణాల వివరాలను జిల్లా పాలనాధికారి శశాంకను అడిగి తెలుసుకున్నారు. ఆయా బ్లాక్‌లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. పనులు ఎంతవరకు వచ్చాయనే వివరాలు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సాధ్యమైనంత తొందరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:బడ్జెట్​లో సుంకాల మోత- సామాన్యుడికి వాత!

ABOUT THE AUTHOR

...view details