లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరీంనగర్ జ్యోతినగర్ కాలనీలోని బీదవారికి చేయూతనందించారు కార్పొరేటర్ గందె మాధవి. కరీంనగర్లోని 59వ డివిజన్ కార్పొరేటర్ గందె మాధవి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు హాజరై 200 మందికి గుడ్లు, పాలు పంపిణీ చేశారు.
కాలనీవాసులకు పాలు, గుడ్లు పంపిణీ చేసిన మేయర్
లాక్డౌన్ నేపథ్యంలో పలువురు పేదలకు సాయం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. కరీంనగర్ జ్యోతినగర్ కాలనీలో కార్పొరేటర్ గందె మాధవి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మేయర్ హాజరై పేదలకు గుడ్లు, పాలు అందజేశారు.
కాలనీవాసులకు పాలు, గుడ్లు పంపిణీ చేసిన మేయర్
ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. జూన్ మాసంలో వర్షాలు కురిసి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలందరూ ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా ఉంటారని ఆయన అన్నారు ఇంటి ఆవరణలో ప్లాస్టిక్ డబ్బాల్లో, కూలర్లలో ఉన్న నిలువ నీటిని తొలగించి.. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కాలనీవాసులకు సూచించారు.
ఇవీ చూడండి:నిబంధనలు పాటించని వారిపై పోలీసుల కొరడా