కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక.. ఇంటికి వెళ్లలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన 40 మంది కార్మికులు ఇక్కడ చిక్కుకుపోయారు. ఇందులో 8నెలల గర్భిణీ కూడా ఉంది.
'పనికోసం వచ్చినం.. ఆదుకోండి' - Migrant laborers news
వలసకూలీల వెతలు అన్నీఇన్నీకావు. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్దామంటే అధికారులు అడ్డుకుంటున్నారని వాపోతున్నారు.
దయచేసి మమ్మల్ని పంపండి సారూ
ఈనెల 15 నుంచి పనులు నిలిచిపోగా.. గుత్తేదారు తమ గ్రామాలకు చేరవేస్తానంటూ.. చెప్పి మోసం చేసి వెళ్లిపోయారని కూలీలు కంటతడి పెట్టుకున్నారు. చిన్న,చిన్నపిల్లలను వదిలి పనుల కోసం ఇక్కడకు వచ్చామని.. ఇప్పుడు అక్కడికి వెళ్లలేక మనసును కుదుట పెట్టుకోలేక ఇబ్బందుల పడుతున్న తీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత