కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అధికార తెరాస సభ్యత్వ నమోదు వేగవంతం చేసింది. ఆరు మండలాల్లో ఇప్పటికే 50 వేల సభ్యత్వాలు నమోదు చేశామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరిస్తున్నారని తెలిపారు. తెరాస సాధారణ, క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా వర్తింపజేసినట్లు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల వల్లే పెద్ద సంఖ్యలో సభ్యత్వం నమోదు
తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు.
సభ్యత్వ నమోదు వేగవంతం చేసిన తెరాస